
న్యూఢిల్లీ: జీఎస్టీ స్థూల వసూళ్లు గత నెల ఏడాది లెక్కన 6.2 శాతం పెరిగి రూ.1.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పోయిన ఏడాది ఇదే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్ల విలువ రూ.1,73,813 కోట్లు ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
జూన్‌లో, దేశీయ లావాదేవీల నుంచి స్థూల ఆదాయం 4.6 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతుల నుంచి జీఎస్టీ ఆదాయం 11.4 శాతం పెరిగి రూ.45,690 కోట్లకు చేరుకుంది. సెంట్రల్ జీఎస్టీ స్థూల ఆదాయం రూ.34,558 కోట్లు, స్టేట్ జీఎస్టీ ఆదాయం రూ.43,268 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఆదాయం రూ.93,280 లక్షల కోట్లుగా ఉంది. సెస్ ద్వారా రూ.13,491 కోట్లు వచ్చాయి.
మొత్తం రీఫండ్ల విలువ 28.4 శాతం పెరిగి రూ.25,491 కోట్లకు చేరుకుంది. నికర జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి గత సంవత్సరంతో పోలిస్తే 3.3 శాతం పెరిగాయి