
కంటోన్మెంట్, వెలుగు : బీఆర్‌ఎస్‌తోనే కంటోన్మెంట్ సెగ్మెంట్ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి లాస్య నందిత తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుతున్న సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు పలకాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలనలో జనాలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ప్రధాని మోదీ పాలనలో ధరలన్నీ పెరిగిపోయాయని మండిపడ్డారు. కారు గుర్తుకే ఓటేసి బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మైనార్టీ నాయకులు, ఉద్యమకారులు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు, మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.