రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు

రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరారు. ఏటా నిర్వహించే సాధారణ హెల్త్‌ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లారని.. ఆయన ఆరోగ్యంగానే  ఉన్నారని రజనీ సతీమణి లతా తెలిపారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్‌ .. బుధవారం రాత్రి తాను నటించిన ‘అన్నాత్తే’ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. నిన్న( గురువారం) సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. విషయం బయటకు తెలియడంతో రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్‌ స్పందించారు.  

రజనీకాంత్‌ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్‌ చెకప్‌ కోసమే ఆస్పత్రిలో చేరారని లతా రజనీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే అని అన్నారు.

ఆస్పత్రికి వెళ్లిన కొన్ని గంటల తర్వాత రజనీకాంత్ ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు. అయితే శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో  చేరారనే ప్రచారమూ జరిగింది. గురువారం రాత్రి రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కావేరి ఆస్పత్రికి వచ్చారు.