75వ కయెన్​ డెలివరీ

75వ కయెన్​ డెలివరీ

లగ్జరీ కార్ల బ్రాండ్​ పోర్షే తన 75వ బర్త్​డేను పురస్కరించుకొని తన 75వ కొత్త కయెన్‌‌ను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. దీనిని ఆరు వారాల క్రితమే ఇండియాలో లాంచ్​ చేశారు.  కయెన్ ధరలు రూ.1.36 కోట్ల నుంచి మొదలవుతాయి. ఇందులోని 3.0-లీటర్ వీ6 పెట్రోల్ ఇంజన్   343 బీహెచ్​పీని విడుదల చేస్తుంది. 

కయెన్ టర్బో జీటీలోని 4.0 లీటర్ల ఇంజన్​ 650 బీహెచ్​పీని ఇస్తుంది. ఈ కారులో యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్‌‌మెంట్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, సిక్స్-పిస్టన్ అల్యూమినియం మోనోబ్లాక్ బ్రేక్ కాలిపర్ల వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.