చిన్నారుల కోసం ఆర్గానిక్ కంఫర్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది స్టార్టప్ సూపర్‌బాటమ్స్.పసికందుల కోసం చిన్నారుల కోసం ఆర్గానిక్ టాప్ మరియు సెట్ తో కూడిన ఆఫరింగ్ కంఫర్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. కోవిడ్ కారణంగా అధికశాతం మంది చిన్నారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు.అలాంటి వారి కోసం ఆర్గానిక్ కాటన్‌లో సూపర్ ఫన్ ప్రింట్స్ డిజైన్‌లో వీటిని తయారుచేశారు. ఈ టాప్ మరియు షార్ట్స్ సెట్‌లో ఎలాంటి అతుకులు, ట్యాగ్స్ ఉండవు. అందువల్ల చిన్నారులకు పూర్తి సౌకర్యవంతంగా ఉంటాయి.
సూపర్ బాటమ్స్ ఫౌండర్ అండ్ సీఈవో పల్లవి ఉతగి మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ ఆరంభం అయిన తరువాత చిన్నారులు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ జీవనశైలి మార్పుకు తగినట్లుగా మారడం వారికి కష్టసాధ్యంగా ఉంది. అది దృష్టిలో ఉంచుకుని శిశువుల జీవితం ఇంటి వద్ద సౌకర్యవంతంగా మలచడానికి ఈ లాంజ్‌వేర్ డిజైన్ చేశాం. సూపర్‌బాటమ్ కంఫర్ట్‌వేర్ 100% ఆర్గానిక్ కాటన్‌తో రూపుదిద్దుకుంది. స్లీవ్‌లెస్ టాప్ మరియు షార్ట్స్ సెట్‌గా ఇవి వస్తాయి’’ అని అన్నారు.
చిన్నారుల కోసం సూపర్‌బాటమ్స్ కంఫర్ట్‌వేర్ సెట్ టాప్, షార్ట్స్ నాలుగు సైజులు ఆరు నెలలు– ఒక సంవత్సరం ; 1–2 సంవత్సరాలు ; 2–4 సంవత్సరాలు ; 4–6 సంవత్సరాలు–లో లభ్యమవుతాయి. ఆఫర్ ధర రూ.349. www.superbottoms.com . అమెజాన్, న్యాకా, ఫ్లిప్‌కార్ట్ ,ఇతర సుప్రసిద్ధ ఈ–కామర్స్ పోర్టల్స్, బేబీ కేర్ స్టోర్స్ వద్ద ఈ కంఫర్ట్‌వేర్ సెట్ లభ్యమవుతుంది.
