రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు స్టూడెంట్​ ఎంపిక

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు స్టూడెంట్​ ఎంపిక

కోనరావుపేట,వెలుగు: రాష్ట్ర  స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలకు కోనరావుపేట మండలం కనగర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి లవణ్ సెలెక్ట్ అయినట్లు జిల్లా క్రీడల సెక్రెటరీ ప్రభాకర్ తెలిపారు. గత డిసెంబర్లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో క్రీకెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యాడని,ఈనెల 26 నుంచి 29 వరకు జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లాలలో జరిగే  రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన లవన్ ను స్కూల్ హెచ్ఎం వినోద్, పీఈటీ అజయ్,గ్రామస్తులు నాయకులు అభినందించారు.