
టాలీవుడ్ హీరోయిన్, కొణిదెల ఇంటికి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ట్రిపోఫోబియా అనే అరుదైన వ్యాధితో లావణ్య బాధపడుతోందని ఈ వార్త సారాంశం. ఇది ఉన్నవారికి కొన్ని ఆకారాలు, వస్తువులు చూస్తే తెలియకుండానే భయం కలుగుతుంది. రెండేళ్లుగా ఈ రుగ్మత లావణ్యను వేధిస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ వాటిని ఖండించింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది. ఇలాంటి వార్తలు రాసేవారు ఎలాంటి ప్రయోజనం పొందుతారో అర్థం కావడం లేదంటూ ఫైర్ అయ్యింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం చేసుకున్న లావణ్య.. వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తోంది.