ట్రెండ్ సెట్ చేసిన లావణ్య త్రిపాఠి పెళ్లి చీర

ట్రెండ్ సెట్ చేసిన లావణ్య త్రిపాఠి పెళ్లి చీర

హీరో వరుణ్‌  తేజ్‌(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మూడు ముళ్ల బంధంతో నవంబర్ 1న ఓ ఇంటివారయ్యారు. ఇటలీలోని టస్కానీ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌,అల్లు అర్జున్‌ పెళ్లి వేడుకకు హాజరై వీరిని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ మ్యారేజ్ కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ఇందులో భాగంగా లావణ్య త్రిపాఠి పెళ్లిలో ధరించిన చీరపై నెటిజన్స్ ఫోకస్ పడింది. దీని ధర ఎంత? ఎక్కడ తయారు చేయించారు.. ఇటలీలోనా? లేక ఇండియాలోనా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు.

ఇప్పటివరకు బాలీవుడ్ లో జరిగిన టాప్ హీరోయిన్స్ ధరించిన చీరల కంటే..లావణ్య త్రిపాఠి ధరించిన ఎరుపు రంగు చీర చాలా ప్రత్యేకంగా ఉండటమే. ఎందుకంటే, బాలీవుడ్ పెళ్లిళ్లు అనగానే.. హీరో, హీరోయిన్స్ దుస్తులపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. రీసెంట్ గా జరిగిన పరిణితి చోప్రా, కైరా అద్వానీ, అలియా భట్..ఇలా అందరూ బిస్కెట్ కలర్, లైట్ ఎల్లో కలర్ చీరలు మాత్రమే ధరించారు.

ఇప్పుడు లావణ్య త్రిపాఠి మాత్రం ఎర్ర చీరలో కనిపించారు. ఇది సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కావడమే..అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. లావణ్య ధరించిన చీర ఎర్ర రంగులో ఉండటమే కాకుండా..చాలా ప్రత్యేకంగా ఉండటం విశేషం. 

ప్రముఖ స్పెషల్ డిజైనర్ మనీష్ మల్హోత్రా (Manish Malhotra)  రూపొందించిన..ఈ ఎరుపు రంగు కాంచీపురం చీర రూ.10 లక్షల వరకు ఖరీదు ఉంటుందని సమాచారం. అంతేకాకుండా మన తెలుగు సంప్రదాయం ప్రకారం..ఈ చీరను డిజైన్ చేయించుకుందట లావణ్య. ప్రేమకు చిహ్నమైన ఎరుపును..మంచి మనసును సూచించే గోల్డ్ ను కలగలిపి మనీష్ మల్హోత్రా ఈ చీరను డిజైన్ చేశారని తెలుస్తోంది. దీంతో మెగా కోడలు రేంజ్ కు తగ్గట్టు..తెలుగు నేటివిటీ కి తగ్గట్టు ఆలోచించించిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ :- స్కూల్ ఎగ్జామ్స్ కు వెళుతూ 15 ఏళ్ల బాలికకు గుండెపోటు

శనివారం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తిరిగి హైదరాబాద్‌ కి రాగా..ప్రస్తుతం రిసెప్షన్‌కు సిద్ధమవుతున్నారు. ఆదివారం (నవంబర్ 5న ) హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ గా వీరి రిసెప్షన్‌ జరగనుంది.