తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంది

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంది
  • హోం మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్నిశనివారం హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనికుమార్, పోలీసు శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో హోం మంత్రి మహమూద్ అలీ మొక్కలు నాటారు. 
ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ ఆలీ మాట్లాడుతూ తెలంగాణ లో లాండ్ అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందని, కరోనా కట్టడి విషయంలో పోలీసులు చాలా మంచి గా పని చేశారని కితాబిచ్చారు. ముఖ్యంగా లాక్ డౌన్ ను పటిష్టగా అమలు చేశారని, పోలీసులు ఫెండ్లీ గా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే అధిక నిధులు కేటాయించామన్నారు. కొత్త టెక్నాలజీ తో నూతన కమిషనరేట్లు , పోలీస్ స్టేషన్స్ నిర్మిస్తున్నామన్నారు. 
తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ -1
జైళ్లను ఫైవ్ స్టార్ హోటల్స్ లా తీర్చిదిద్దుతున్నామని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. అదేవిధంగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలో నే నెంబర్ వన్ గా ఉన్నారని, ప్రజల సమస్య ల పరిష్కారనికి పోలీసులు నిరంతరం పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ని న్యూ సిటీ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నూతన పోలీస్ స్టేషన్స్ తో ప్రజలకు న్యాయం జరుగుతుందని  భరోసా ఇచ్చారు. 
పోలీసులు ఛాలెంజింగ్ గా పనిచేస్తున్నారు: డీజీపీ
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మోడల్ పోలీస్ స్టేషన్ ను నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. హైదరాబాద్ చంద్రాయనణగుట్ట లో 4 లక్షల జనాభా ఉందని, ప్రభుత్వం కొత్త పోలీస్ స్టేషన్స్ లకు నిధులు మంజూరు చేసిందన్నారు. పోలీసులు ఛాలెంజింగ్ గా పని చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్ మెంట్ కు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, సేఫ్ సెక్యూరిటీ లో ముందు ఉన్నామని, పోలీసులు అన్ని సమస్య పరిష్కారం కోసం  పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అందిస్తున్నామని, అందరికీ సమానంగా న్యాయం అందిస్తున్నామన్నారు. సేఫ్ అండ్ సెక్యూరిటీ లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల ప్రాజెక్టు తో పబ్లిక్ సపోర్ట్ తో క్రైమ్ కంట్రోల్ లో ఉందన్నారు. చంద్రాయణగుట్ట నిజాం కాలం నుంచి ఇప్పటివరకు చాలా అభివృద్ధి చెందిందన్నారు. 
ఎమ్మెల్సీ సురభి వాణి దేవి మాట్లాడుతూ  పోలీసులు  ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో శుభ్రమైన వాతావరణ ఉండాలన్నారు. పాత భవనాల పోలీస్ స్టేషన్ కు రావడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు సీసీ కెమెరాలు చాలా ముఖ్య మైనవిగా మారాయని,  క్రైమ్ కంట్రోల్ లో పోలీసులు చాలా బాగా పని చేస్తున్నాయన్నారు. పోలీసులు ఛాలెంజింగ్ గా పనిచేస్తున్నారని ఆమె కితాబిచ్చారు. పోలీసులకు మంచి బిల్డింగ్ ఉండాల్సిన అవసరం ఉందని, ఇప్పుడు పాత పోలీస్ స్టేషన్స్ కన్పించడం లేదని, కొత్త పోలీస్ స్టేషన్ భవనాలతో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. 
ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఓల్డ్ సిటీ లో ఇంకా చాలా పోలీస్ స్టేషన్స్ పాత భవనాల్లో ఉన్నాయని, వాటిని కూల్చి వేసి కొత్తవి కట్టాలన్నారు. కొన్ని పోలీస్ స్టేషన్స్ చాలా లోపలి ప్రదేశాల్లో ఉన్నాయని.. వాటిని ప్రభుత్వం ఖాళీ ప్రదేశాలకు మార్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కొన్ని పోలీస్ స్టేషన్ కు నిధులు రావడం లేదన్నారు. మరి కొన్ని  కొత్త పోలీస్ స్టేషన్స్ నిర్మించాల్సిన అవసరం ఉందని ఎంపీ ఒవైసీ పేర్కొన్నారు. 
హైదరాబాద్ సీపీ అంజనికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, సిటీ లో క్రైమ్ కంట్రోల్ లో ఉందన్నారు. చాంద్రాయణగుట్ట పరిధిలో 4 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని, సిటీలో అన్ని పోలీస్ స్టేషన్స్ లో ప్రజలకు సమన్యాయం అందిస్తున్నామన్నారు. పబ్లిక్, పోలీస్ సమన్వయంతో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు. పబ్లిక్  సేఫ్టీ , సెక్యూరిటీకి  అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.