జమిలీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావు.. లా కమిషన్ కీలక ప్రకటన

జమిలీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావు.. లా కమిషన్ కీలక ప్రకటన

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై లా కమిషన్ కీలక ప్రకటన చేసింది. జమిలీ ఎన్నికలు 2024లో   సాధ్యం కావని తేల్చింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణలు చేయకుండా జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పింది. 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను (One nation One election) నిర్వహించేలా లా కమిషన్‌ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: రాష్ట్రపతి ఆమోదం... చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు..

కేంద్ర ప్రభుత్వం కూడా జమిలి ఎన్నికలకు సిద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లా కమిషన్ చేసిన సూచనతో జమిలి ఎన్నికలు  లేనట్లేనని తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్,మిజోరం, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలు ఈ ఏడాది చివరికల్లా  షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.