హైదరాబాద్, వెలుగు: ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో లాసెట్, పీజీఎల్ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి రిలీజ్ చేశారు. ఈ నెల 24న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని.. ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.
వచ్చే నెల 5 నుంచి 20 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. ఆగస్టు 22 , 23 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని, 24న ఎడిట్ ఆప్షన్ ఉంటుందని తెలిపారు. 27న వెబ్ సైట్లో సెలెక్షన్ లిస్టు పెడ్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థు లు 30లోగా కాలేజీల్లో రిపోర్టు చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొనా లని సూచించారు. సమావేశంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
