నేర స్వభావంపై లా స్టూడెంట్లకు అవగాహన ఉండాలి : డీజీపీ అంజనీకుమార్

నేర స్వభావంపై లా స్టూడెంట్లకు అవగాహన ఉండాలి : డీజీపీ అంజనీకుమార్

శామీర్​పేట, వెలుగు:  నేరం, నేర స్వభావాలపై  లా స్టూడెంట్లు అవగాహన పెంచుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. బుధవారం శామీర్​పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో వీసీ కృష్ణదేవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ హాజరై.. పోలీసింగ్ వ్యవస్థ పనితీరు, నేర స్వభావాలపై మాట్లాడారు.

పోలీస్ వ్యవస్థ పనితీరులో ఎంతగానో మెరుగు పరుస్తున్నప్పటికీ నేరాలు రూపాన్ని మార్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులు సవాళ్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నేరాలను అరికట్టడానికి పోలీస్ వ్యవస్థ చేసే పరిశోధనలు, విచారణలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ శాంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.