రంగారెడ్డి కోర్టు ఆవరణలో న్యాయవాదుల నిరసన 

రంగారెడ్డి కోర్టు ఆవరణలో న్యాయవాదుల నిరసన 

రంగారెడ్డి కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన తెలిపారు. బతుకమ్మ  సంబరాలకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళన చేస్తున్న న్యాయవాదులను అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.

బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతున్న క్రమంలో.. న్యాయవాదుల హత్యలపై స్పందించని ఎమ్మెల్సీ కవిత గో బ్యాక్ అంటూ కొందరు న్యాయవాదులు నినాదాలు చేశారు. న్యాయవాదులకు కవిత ఏం చేశారని, ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.