పేటీఎంలో జాబ్స్​ కట్​

పేటీఎంలో జాబ్స్​ కట్​

న్యూఢిల్లీ: పేటీఎం పేరెంట్​కంపెనీ వన్​97 కమ్యూనికేషన్స్  ఉద్యోగులను తొలగిస్తోంది.  వారికి అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సపోర్ట్​ను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది.మార్చి 2024 క్వార్టర్​లో పేటీఎం సేల్స్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 3,500 తగ్గి 36,521 మందికి పడిపోయింది. 

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.   ఎంత మందిని తీసేశారనే  విషయాన్ని పేటీఎం వెల్లడించలేదు.  కస్టమర్ ఖాతాలు, వాలెట్లు  ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీసుకోకుండా పేటీఎంపై ఆర్​బీఐ నిషేధం విధించింది.