కూతురిపై అత్యాచారం కేసులో తండ్రికి జీవిత ఖైదు

V6 Velugu Posted on Apr 08, 2021

జీడిమెట్ల/గచ్చిబౌలి, వెలుగు: కూతురిపై అత్యాచారం కేసులో తండ్రికి జీవితఖైదు విధిస్తూ ఎల్ బీనగర్ లోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శిక్ష విధించింది. కొంపల్లిలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన కొనగల్ల వేణు(40) లేబర్ పనిచేసేవాడు. అతడి భార్య 8 ఏండ్ల క్రితం చనిపోయింది. వేణు నాలుగేండ్ల క్రితం మద్యం తాగి వచ్చి 10 నెలల పాటు   చిన్న కుమార్తె(17)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని కూతురిని బెదిరించాడు.  2017లో దీపావళికి ఆ బాలిక వరంగల్​లోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ బాలిక అనారోగ్యంగా కనిపించడంతో చిన్నమ్మ ఏమైందని అడిగింది. దీంతో బాలిక జరిగిన విషయం చెప్పింది.  తర్వాత  బాలిక చిన్నమ్మతో కలిసి అదే ఏడాది అక్టోబర్ 25న పేట్ బషీరాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు వేణును అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అతడిపై చార్జిషీట్ ఫైల్ చేశారు.  బుధవారం ఎల్ బీనగర్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రాగా.. జడ్జి సురేశ్​నిందితుడు వేణకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేలు ఫైన్ విధిస్తూ తీర్పునిచ్చారు.

Tagged LB NAGAR, father, daughter, rape case

More News