మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి

మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి
  • పేదలకు అన్యాయం చేస్తామంటే ఊరుకోం
  • ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి

ఎల్బీనగర్, వెలుగు: మూసీ ప్రక్షాళనకు బీఆ ర్ఎస్ వ్యతిరేకం కాదని, పేదలకు అన్యాయం జరిగితే మాత్రం బుల్డోజర్లకు  అడ్డంగా నిలబడతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి అన్నారు. చైతన్యపురి డివిజన్​లోని ద్వారకాపురం కాలనీ లో మూసీ బాధితులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఇండ్లను ఎప్పుడు కూలుస్తోందోనని, కంటిమీద కునుకు లేకుండా పేదలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తోట మహేశ్ యాదవ్, సొంటి చంద్రశేఖర్ రెడ్డి, త్రివేది, లక్ష్మీ నారాయణ కాలనీ వాసులు  పాల్గొన్నారు.