కరోనా ఫియర్ తో లీడర్ల  హోం క్వారంటైన్

కరోనా ఫియర్ తో లీడర్ల  హోం క్వారంటైన్
  • ప్రోగ్రామ్స్ క్యాన్సిల్స్ చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు
  •  మంత్రి కేటీఆర్‌‌ వరంగల్‌ ‌పర్యటన రద్దు
  •  ఆయన దారిలోనే పలువురు మినిస్టర్లు
  •  డ్యూటీలకు రావద్దని పీఏలు, గన్‌‌‌‌మెన్లకు ఆదేశాలు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌‌‌ కేసులు పెరుగు తుండడం, మూడు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్ర తినిధుల్లో కరోనా ఫియర్ మొదలైంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సహా అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని హోం క్వారంటైన్ కు వెళ్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు ఫస్ట్ లైన్లో ఉన్నారు. తమను కలిసేందుకు ఎవరూ రావద్ద ని ప్రజలకు, పార్టీలీడర్లు, కార్యకర్తలకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞ ప్తి చేస్తున్నారు. మళ్లీ చెప్పేదాకా డ్యూటీలకు రావద్దని పీఏ లు, గన్‌‌‌‌మెన్లకు ఆదేశాలు జారీ చే స్తున్నారు. నియోజకవర్గాల్లో ఉంటే ఎవరో ఒకరు వచ్చి కలుస్తున్నారనే భయంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నారు.

.. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తెలుసుకొని మంత్రి వేముల ప్రశాంత్‍రెడ్డి ఆదివారం తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, భూమిపూజలను అర్ధాంతరంగా రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు.

..వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెక్యూరిటీలోని ఓ ఏఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు. 14 రోజుల పాటు ఎవరూ తనను కలిసేందుకు రావద్ద ని ఆయన అనుచరులు, కార్యకర్తలు, లీడర్లకు సూచించారు.

..మంత్రి గంగుల కమలాకర్ రెండు రోజుల క్రితం వరకు కరీంనగర్ లో రెగ్యులర్ ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వెళ్నిన ఆయన, వచ్చే వారంపాటు ఎవరినీ కలవకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతోంది.

.. మంత్రులు ఈటల రాజేందర్, పువ్వాడ అజయ్‌‌ ‌‌కొద్ది రోజులుగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం లేదు.

.. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డివారం రోజుల వరకు తన ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎవరూ తనను కలిసేందుకు రావద్ద ని సూచించారు.

..తనను కలిసేందుకు క్యాంపు ఆఫీసుకు ఎవరూ రావద్దని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు.

.. కరోనా భయంతో సంగారెడ్డి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోగ్రామ్స్ జరగడం లేదు. ఎమ్మెల్యేలు క్యాంపు ఆఫీసులకు రావడం లేదు. తమను కలవడానికి ఎవరూ రావద్ద ని సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు.

…మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కొద్దిరో జులుగా తన క్యాంప్ ఆఫీస్ కు రావడం లేదు. హైదరాబాద్ లోని తన ఇంటికి కొద్దిరోజుల పాటు ఎవరూ రావద్ద ని సూచించారు.

.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వారం రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ కు రావడంలేదు. జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి సైతం ఇంటి నుంచి బయటికి రావడం లేదు.

.. కోరుట్లఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రెండు రోజుల నుంచి ఎలాంటి ప్రోగ్రామ్స్ కు అటెండ్ కావడం లేదు. వీరిద్దరూ హైదరాబాద్ లోనే ఉండిపోయారు.

.. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత తనను ఫోన్లోగానీ, వాట్సప్ ద్వారా గానీ సంప్రదించాలని, ఎవరూ కలిసేందుకు రావద్దని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పంపారు.

…రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని నుంచి హైదరాబాద్ కు మకాం మార్చారు . ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారని, కేవలం ఫోన్లో మాత్రమే అందుబాటులోకి వస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు .

మినిస్టర్ కేటీఆర్‌‌‌‌ పర్యటన రద్దు

బుధవారం వరంగల్‌‌‌‌లో భద్రకాళి బండ్ సహా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరు కావాల్సిన మినిస్టర్ కేటీఆర్‌ తన పర్యటనను రద్దుచేసుకున్నారు. ఆయన టూర్ క్యాన్సిల్ కాగానే వరంగల్‌ ‌పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ నుంచి వెల్లిపోయారు. కేటీఆర్ దారిలోనే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అధికారిక పర్యటనలు రద్దుచేసుకుంటున్నారు. కొందరు హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యి అక్కడే హోంక్వారంటైన్లో ఉంటున్నారు. అత్యవసరమైతే ఫోన్లో మాట్లాడాలని, వాట్సాప్ లో మెసేజ్ లు పెట్టాలి తప్ప తప్ప తమను కలిసేందుకు రావద్ద ని ప్రజలకు, కార్యకర్తలకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

క్యాంపు ఆఫీసులు ఖాళీ

రెండు, మూడు రోజుల నుంచి ఎమ్మెల్యేలు లేకపోవడంతో వారి క్యాంపు ఆఫీసులు వెలవెలబోతున్నాయి. మంత్రులు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లకు జిల్లాల్లో సర్కారు కేటాయించిన ఆఫీసుల్లోనూ ఇదే సీన్ కన్పిస్తోంది. ఆయా ఆఫీసుల్లోని పర్సనల్ అసిస్టెంట్ లు, పీఆర్వోలు, పోలీస్‌ ‌గన్‌ ‌‌‌మెన్లు కూడా ఇండ్లకు వెళ్లిపోతున్నారు. గ్రామ పంచాయతీ ఆఫీసులకు సర్పంచులు, మండల పరిషత్‌‌లకు ఎంపీపీలు కూడా వెళ్లడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.