
దేశాని కి కావాల్సింది చౌకీదార్లు కాదని, ప్రజల కోసం పనిచేసే జిమ్మేదార్లు కావాలని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు . కేంద్రంలో తెలంగాణకు చెందిన ఏకైక మంత్రి దత్తాత్రేయను తీసేసి , రాష్ట్రాన్నిఅవమానించారని, తెలంగాణ ఎంపీల్లో ఒక్కరూ కేంద్ర మంత్రి పదవులకు పనికిరాలేదా అని నిలదీశారు. అటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. నేతన్నలను, రైతులను, ప్రజలను పట్టిం చుకునే కేసీఆర్ లాంటి నాయకులు ఈ దేశాని కి కావాలన్నారు. 16 మంది గులాబీ సైనికులు లోక్ సభలో ఉంటే తెలంగాణకు న్యా యం జరుగుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజన్న సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభమని, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభమని.. కానీ టీఆర్ ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని అన్నారు .
కలిసొస్తే వినోద్ కేంద్ర మంత్రి అయితరు….
‘‘ఎట్టికై నా మట్టికైనా మనోడు ఉండాలని పెద్దలు చెబుతారు. అందుకే కేంద్రంలో మనవాళ్లుంటే ఎక్కువ న్యా యం జరుగుతది. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు గెలిస్తే .. ఏది కావాలన్నా ఢిల్లీకి వెళ్ళాల్సిందే. గల్లీలో ఉన్న మన బాధలు వారికి పట్టవు. అదే టీఆర్ ఎస్ బిడ్డలు గెలిస్తే .. 16 మంది గులాబీ సైనికులు లోక్ సభలో ఉంటే.. కేంద్రంలో పోరాడుతం. ఇద్దరు ఎంపీలుంటేనే.. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. 16 మంది ఎంపీలు ఉంటే ఏం చేస్తడో ఆలోచించాలె” అని కేటీఆర్ పేర్కొన్నారు . 2014లో మోడీపై కొన్ని భ్రమలు ఉండేవని, ఆయనను నమ్మి ప్రజలు 280 సీట్లు కట్టబెట్టారని, కానీ ఆ పరిస్థితి ఇప్పుడులేదన్నారు . ‘‘మోడీ వేడి తగ్గిం ది. కాంగ్రెస్ గాడి తప్పింది. కాంగ్రెస్ కు జోష్ లేదు. కాంగ్రెస్ కు హోష్ లేదు. చంద్ర బాబు, రాహుల్ అలయ్ బలయ్ చే సుకున్నట్లు .. మోడీ , రాహు ల్ అలయ్ బలయ్ చేసుకొని కలసిపోయినా 270 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఒక్కొక్క ఎంపీ స్థానం కీలకం కానుంది. మన తెలంగాణ మన ఇంటి బిడ్డలనే గెలిపించుకోవాలి” అని కేటీఆర్ తెలిపారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాలం కలిసొస్తే కరీంనగర్ ఎంపీగా గెలవబోయే బోయినిపల్లి వినోద్ కుమార్ కేంద్ర మంత్రి అవుతారని కేటీఆర్ అన్నారు .