ఇవాళ (జూన్ 08) ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీల నాయకులు భేటీ

ఇవాళ (జూన్ 08) ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీల నాయకులు భేటీ

న్యూఢిల్లీ: ‘ఇండియా జన్ బంధన్’ సమావేశంలో పాల్గొనేందుకు 23 రాజకీయ పార్టీలు అంగీకారం తెలిపాయని కాంగ్రెస్ పేర్కొంది. సోమవారం ఢిల్లీలోని కాన్‌‌‌‌స్టిట్యూషన్ క్లబ్‌‌‌‌లో సమావేశం జరగనుంది. 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాతీయ అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. 

కొన్ని పార్టీలు వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నాయని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. ఉమ్మడి లక్ష్యం, స్పష్టమైన ఉద్దేశంతో ఈ సమావేశం జరుగుతోందని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ వెల్లడించారు. తమిళనాడులో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించగా, ఆప్ ఇప్పటికే దూరంగా ఉంది. 

కేరళలో లెఫ్ట్- బీజేపీ అవగాహనపై కాంగ్రెస్ వ్యాఖ్యలను సీపీఎం తప్పుబట్టింది. గతంలోనూ పార్లమెంట్ సమావేశాలకు ముందు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ కూటమి ఉమ్మడి వ్యూహాలు రచించింది.