ముస్లింలకు హోం మంత్రి మహమూద్ అలీ క్షమాపణలు చెప్పాలి

ముస్లింలకు హోం మంత్రి  మహమూద్ అలీ క్షమాపణలు చెప్పాలి

ఖానాపూర్, వెలుగు: రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ యావత్ ముస్లిం సమాజానికి బహిరంగ క్షమాపణలు  చెప్పాలని ఖానాపూర్ ముస్లిం సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ను మహమ్మద్ ప్రవక్త సన్నిహితుడైన హజ్రత్ ఉమర్ ఇబ్న్ అల్, ఖతాబ్ ఇస్లాం రెండో ఖలీఫాతో హోం మంత్రి పోల్చడం దారుణమన్నారు. 

ALSO READ:  నేతకానీలకు ద్రోహం చేసిన .. చిన్నయ్యను ఓడించాలి

తమ రాజకీయాల కోసం మత విశ్వాసాలను దెబ్బ తీసేలా మహమూద్​అలీ మాట్లాడారని.. బేషరతుగా ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు. కేసీఆర్ సర్కార్ లో ముస్లింలకు ఎలాంటి న్యాయం  జరగలేదన్నారు. సమావేశంలో నాయకులు జహీర్ హైమద్, అమనుల్లా ఖాన్, షబ్బీర్ పాషా, షౌకత్, అసిఫ్ అలీ, షకీల్, ముషీర్ తదితరులు పాల్గొన్నారు.