రాహుల్ అదుర్స్.. ఢిల్లీకి భారీ టార్గెట్

రాహుల్ అదుర్స్.. ఢిల్లీకి భారీ టార్గెట్

ఐపీఎల్ సీజన్ 15లో భాగంగా నేడు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో అదరగొట్టింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. లక్నోకు మంచి ప్రారంభం దక్కింది. డీకాక్, కేఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ ఇవ్వగా..42 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 23 పరుగలు చేసిన డికాక్‌.. శార్ధూల్‌ ఠాకుర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా చెలరేగి ఆడాడు. దీంతో కేఎల్ రాహుల్ , దీపక్ హుడా మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్‌ రాహుల్‌ 77 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీపక్‌ హుడా 52 పరుగులతో రాణించాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ చెలరేగి ఆడాడు. దీంతో అతడి ఐపీఎల్ కెరీర్ లో 1000 రన్స్ పూర్తి చేసుకుని రికార్డుకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.