
హైదరాబాద్, వెలుగు: సీఎస్ శాంతి కుమారి సెలవులో ఉన్నారు. అమెరికాలో ఉన్న తన కూతురు దగ్గరకు సీఎస్ వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి సీఎస్ తెలియజేసినట్లు సమాచారం. గత నెల 31 నుంచి ఈ నెల 6 వరకు సీఎస్ సెలవులో ఉన్నారు. తిరిగి గురువారం విధుల్లో చేరాల్సి ఉంది. సీఎస్ సెలవులో ఉన్నప్పుడు బాధ్యతలు మరో సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. అయితే అత్యవసర అంశాలకు అందుబాటులో ఉంటానని చెప్పడంతో.. ప్రభుత్వం ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు.