లెజెండరీ స్పిన్నర్ షేన్‌ వార్న్‌కు యాక్సిడెంట్

V6 Velugu Posted on Nov 29, 2021

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తనయుడు జాక్సన్ తో కలసి బైక్ పై వెళ్తుండగా వాహనం స్కిడ్ అయ్యింది. దీంతో కిందపడిన వార్న్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మాజీ లెగ్ స్పిన్నర్ స్పందిస్తూ.. ఆందోళన చెందాల్సిందేమీ లేదన్నాడు. స్వల్ప గాయాలు అయ్యాయని.. కానీ నొప్పి మాత్రం తీవ్రంగా ఉందన్నాడు. భారీ ప్రమాదం నుంచి బయట పడినప్పటికీ బాధిస్తోందన్నాడు. కాగా, డిసెంబర్ 8 నుంచి మొదలయ్యే యాషెస్ సిరీస్ లో వార్న్ కామెంట్రీ చేయాల్సి ఉంది. మరి, త్వరగా గాయం నుంచి కోలుకుని కామెంట్రీ చేస్తాడో లేదో వేచి చూడాలి. 

Tagged Cricket, shane warne, Australia Cricket Team, Shane Warne Accident

Latest Videos

Subscribe Now

More News