పంచాయతీ రాజ్ ,మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు శాసన మండలి ఆమోదం..

పంచాయతీ రాజ్ ,మున్సిపల్  చట్ట సవరణ బిల్లులకు శాసన మండలి ఆమోదం..

పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ బిల్లులను తెలంగాణ శాసన మండలి ఆమోదించింది. బీఆర్ఎస్ నిరసనల మధ్య మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.

తెలంగాణ మండలిలో గందరగోళం నెలకొంది. ఓ వైపు ప్రభుత్వం బీసీ బిల్లుపై చర్చ జరుపుతుండగా.. కాళేశ్వరంపై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్  సభ్యులు నిరసనకు దిగారు.  

  సెప్టెంబర్ 1న మండలి ప్రారంభం అవ్వగానే బీఆర్ఎస్ సభ్యులు మండలి ఛైర్మన్ పోడియం చుట్టూ నిరసనకు దిగారు.  కాళేశ్వరం కమిషన్ బూటకం అంటూ అని.. సీబీఐతో దోస్తీ  బీజేపీతో కుస్తీ,  కాంగ్రెస్ బీజేపీ నాటకం అంటూ నినాదాలు చేశారు.  రాహుల్ కి సీబీఐ వద్దు, రేవంత్ కి సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు.  పీసీ  ఘోష్ కమిషన్ రిపోర్ట్ నివేదిక చింపేసి నిరసన తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాగితాలు చించి ఛైర్మెన్ పై  విసిరేశారు .  కాళేశ్వరం విచారణను సీబీఐ కి ఇవ్వడాన్నీ వ్యతిరేకించారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళనల మధ్య బీసీ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశ పెట్టారు. అయితే బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. పెద్దల సభలో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కునేందుకు భయమెందుకని ప్రశ్నించారు . సీబీఐ విచారణ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. విచారణ ఎదుర్కొంటామన్న వాళ్లు ఇపుడెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కావాలనే బీసీ రిజర్వేన్ బిల్లును బీఆర్ఎస్ అడ్డుకుంటోందని విమర్శించారు పొన్నం. 

బీఆర్ఎస్ నిరసనల మధ్యే  పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు  తెలంగాణ శాసన మండలి ఆమోదం తెలిపింది.  బిల్లులు  ఆమోదం పొందినట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.