
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శాసన మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు తన కుమారుడు అమిత్‌తో కలిసి వెళ్లిన గుత్తా.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
అలాగే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఆలంపూర్ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కూడా కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, అంతకుముందు హైదరాబాద్‌లో బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ను ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి,ఎమ్మెల్యే విజయుడు కలిశారు.