‘త్రీ ఇడియట్స్‌’ స్కూళ్లో గోడ ‘డూప్‌’!

‘త్రీ ఇడియట్స్‌’ స్కూళ్లో గోడ ‘డూప్‌’!

లేహ్: త్రీ ఇడియట్స్​సినిమా గుర్తుందా.. అందులో ఆమిర్​ఖాన్​చదువు చెప్పిన స్కూల్​ఇదే. సినిమా క్లైమాక్స్ సీన్లు​తీసింది ఇక్కడే. సినిమా బ్లాక్ బస్టర్​కావడంతో ‘రాంచో స్కూల్’ అంటూ ఈ స్కూల్​కూ బాగా పేరొచ్చింది. ఎక్కడెక్కడినుంచో జనం ఈ స్కూల్​లోని గోడను చూసేందుకే వస్తున్నారట. మొదట్లో సంతోషించినా.. ఇప్పుడు మాత్రం ఇదెక్కడి గోలరా బాబూ అని టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. రోజూ జనాలు వస్తూపోతుండడంతో పిల్లల చదువు దెబ్బతింటోందని అంటున్నారు. పైగా స్కూల్​ను రాంచో స్కూల్​అనడమూ నచ్చలేదంటున్నారు. తమ స్కూల్​పేరు ‘డ్రుక్​పద్మా కార్పో స్కూల్’ అని, ఆ పేరుతోనే పిలవాలంటున్నారు. స్టూడెంట్లు కూడా తాము డ్రుక్​పద్మా కార్పో స్కూల్​విద్యార్థులమనే చెప్పుకుంటామని, అలాగే గుర్తించాలని కోరుకుంటామని అంటున్నారు. టూరిస్టుల తాకిడితో స్కూలు ఎట్మాస్పియర్​దెబ్బతినకుండా అక్కడికి దగ్గర్లోనే ఓ డూప్లికేట్​గోడను కట్టి ఓ కాంపౌండ్​వాల్​ను ఏర్పాటు చేశారట. దీంతో అటు టూరిస్టులు, ఇటు స్టూడెంట్లు అంతా హ్యాపీ అని టీచర్లు చెబుతున్నారు.