ఏఐ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోను ప్రదర్శించిన లెనోవో

ఏఐ  పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోను ప్రదర్శించిన  లెనోవో

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ టెక్​కంపెనీ లెనోవో, హైదరాబాద్‌‌‌‌లో గురువారం తమ పూర్తిస్థాయి ఎంటర్​ప్రైజ్ ఏఐ పోర్ట్‌‌‌‌ఫోలియోను ప్రదర్శించింది. అందరికీ స్మార్టర్ ఏఐని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది.  వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను ఆధునీకరించడానికి, టెక్నాలజీలను సమర్థంగా ఉపయోగించుకోవడానికి ఈ సొల్యూషన్లు ఉపయోగపడతాయని లెనోవో తెలిపింది.  

కంపెనీ ఎంటర్​ప్రైజ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ మిదా మాట్లాడుతూ, తమ ఏఐ పోర్ట్‌‌‌‌ఫోలియోలో సర్వర్‌‌‌‌లు, స్టోరేజీ, ఎడ్జ్, హెచ్​పీసీ ఉన్నాయని చెప్పారు.  సైబర్ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్‌‌‌‌తో కలిసి థింక్ షీల్డ్ ఎక్స్‌‌‌‌డీఆర్ వంటి సెక్యూరిటీ సేవలనూ అందిస్తున్నామని పేర్కొన్నారు.