రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. గతంలో కోనరావుపేట మండలంలో రెండు చిరుతలు చాల సార్లు లేగ దూడలపై దాడులు చేసి చంపేశాయి. తాజగా మళ్లీ కోనరావుపేట మండలంలోని శివంగాల పల్లి గ్రామ శివారులోని అవుపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో ఆవు చనిపోయింది. ఈ ఘటనతో గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన అనంత రెడ్డి అనే రైతుకు చెందిన రూ. 70 వేల విలువగల ఆవు చిరుత దాడిలో చనిపోయింది. దీంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
గతంలోను అదే ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మళ్లీ చిరుత సంచారంతో సమీప అటవీ గ్రామల రైతులు అందోళన చెందుతున్నారు. ముఖ్యంగా శివంగలపల్లి, మర్రిమడ్డ, కంచర్ల, వీర్నపల్లి, అక్కపల్లి ప్రాంతాలలో చిరుతలు తరుచూ లేగ దూడలపై దాడులు చేస్తున్నాయి. ఇక వేసవి కాలం ప్రారంభం కావడంతో చిరుతలు నీటి వసతి కోసం సమీప గ్రామాల్లోకి వస్తుంటాయని ఫారెస్టు అధికారులు అంటూన్నారు.
ఇవి కూడా చదవండి:
రైలులో 32 కిలోల బంగారం సీజ్
యూపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం
