రైలులో 32 కిలోల బంగారం సీజ్

రైలులో 32 కిలోల బంగారం సీజ్

రైలులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో రూ. 16కోట్లు విలువైన 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైలులో తనిఖీలు చేపట్టిన రైల్వే పోలీసులు.. ఎలాంటి పత్రాలు లేని బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారు బంగారానికి సంబంధించిన జీఎస్టీ పత్రాలు సమర్పించడంలో విఫలం అయ్యారని పోలీసులు తెలిపారు.