యూపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం

యూపీలో ఆరో విడత పోలింగ్  ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ కన్యా నగర్ క్షేత్ర ప్రైమరీ స్కూల్ లో ఓటు వేశారు. 

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సీఎం యోగీ ప్రాతినిథ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌ తో పాటు మొత్తం 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 676 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 2,14,62,816 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్‌ మౌర్య ఫాజిల్‌నగర్‌ నుంచి బరిలో నిలిచారు. పీసీసీ అధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ లల్లూ తమ్‌కుహీరాజ్‌ నుంచి పోటీచేస్తున్నారు. తులసీపూర్‌, గోరఖ్‌పూర్‌ రూరల్ నియోజకవర్గాల్లో అత్యధికంగా అభ్యర్థులు పోటీలో ఉండగా.. సలేంపూర్‌లో అతి తక్కువ మంది బరిలో ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం..

8వ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం

పచ్చదనం కోల్పోయిన బయోడైవర్సిటీ పార్కు