తరగతి గదిలోకి వచ్చి విద్యార్థిపై దాడి చేసిన పులి 

V6 Velugu Posted on Dec 01, 2021

చిరుతపులి కాలేజీ తరగతి గదిలోకి వచ్చి ..ఓ విద్యార్థిపై దాడి చేసింది.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ జిల్లాలో ఇవాళ( బుధవారం) జరిగింది. ఛర్రా లోని  చౌదరి నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్‌లోని క్లాస్‌ రూమ్‌లోకి ఒక పులి చొరబడింది.  పులిని చూసిన విద్యార్ధులు  బయటకు పరుగులు తీశారు. ఇందులో ఓ విద్యార్థిపై పులి దాడి చేసి గాయపర్చించింది. ఈ సందర్భంగా స్వల్పంగా తొక్కిసలాట జరిగింది.

చిరుత దాడికి గురైన విద్యార్థి వీపు, చేతికి గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని స్థానిక ఆస్పత్రికి  తరలించి చికిత్స అందించారు. చిరుత దాడి గురించి పోలీసులు, అటవీశాఖ అధికారులకు స్కూల్‌ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. మరోవైపు క్లాస్‌లో చిరుత ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Tagged Leopard,  class,  stampede children, injuring teenager, Barauli,  Aligarh

Latest Videos

Subscribe Now

More News