ప్రాణాల కోసం చిరుత పులి ‘జంప్’.. రెప్పపాటులో సేఫ్!

ప్రాణాల కోసం చిరుత పులి ‘జంప్’.. రెప్పపాటులో సేఫ్!
  • చెట్టెక్కి చావు నుంచి బయటపడిన చిరుత

చావుకీ, బతుక్కీ మధ్య ఒక్క చిన్న జంప్.. ఆ చిరుత పులిని కాపాడింది. రెప్పపాటు టైంలో ఎగిరి చెట్టుపైకి ఎక్కేసి.. ప్రాణాలు కాపాడుకుంది. మింగేసేలా మీదికొచ్చిన మృత్యువు నుంచి చాకచక్యంగా బయటపడింది. చిన్న గాయం కూడా కాకుండా శత్రువు నుంచి తప్పించుకుంది.

….ఏంటి ఇది నిజమా? చిరుత పులి ఏంటీ.. ప్రాణాల కోసం పరార్ అవ్వడమేంటీ? అనిపిస్తోందా? అవును ఇది నిజమే. అడవిలో చిరుతను కూడా వేటాడే క్రూర మృగాలు రెండున్నాయి. అవి ఒకటి సింహం. రెండోది హైనా.

ఒడిశాలోని చిల్కా అటవీ ప్రాంతంలో ఓ చిరుతకు హైనా ఎదురుపడింది. పట్టుకుని పీక కొరికేయాలన్నంత స్పీడ్ గా మీదికి రాబోయింది హైనా. అయితే చిరుతను దాని వేగమే కాపాడింది. అలా తిరిగిపట్టుకోబోయే లోపే హైనా పైనుంచే జంప్ చేసి.. చెట్టు ఎక్కేసింది చిరుత పులి. హమ్మయ్య అనుకుని చెట్టుపైన సేఫ్ గా కూర్చుంది.

ఈ ఇన్సిడెంట్ వీడియోను ఒడిశా ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.