కోర్టు ఆవరణలో చిరుత కలకలం...ముగ్గురికి గాయాలు

కోర్టు ఆవరణలో చిరుత కలకలం...ముగ్గురికి గాయాలు

యూపీ ఘజియాబాద్ కోర్టులో చిరుతపులి కలకలం సృష్టించింది. కోర్టు ఆవరణలోకి వచ్చిన చిరుతపులి అక్కడ  చెప్పులు కుట్టే వ్యక్తితో పాటు ఓ అడ్వొకేట్, మరో వ్యక్తిని గాయపరిచింది. ఒక్కసారిగా కోర్టు ఆవరణలోకి చిరుత పులి రావడంతో జనం ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. దీంతో బెదిరిపోయిన చిరుత అక్కడే ఉన్న చెప్పులు కుట్టే వ్యక్తిపై దాడి చేసింది. దాన్ని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన అడ్వొకేట్, మరో వ్యక్తిపైన దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత పులిని  బంధించేందుకు రంగంలోకి దిగారు.