రాయికల్‌‌‌‌లో కుష్ఠు నిర్ధారణ శిబిరం

రాయికల్‌‌‌‌లో కుష్ఠు నిర్ధారణ శిబిరం

రాయికల్, వెలుగు:  రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం కుష్ఠు వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో గత నెలలో రాయికల్  మండలంలో గుర్తించిన 85 మంది కుష్ఠు అనుమానితులను  స్క్రీనింగ్ చేసి 10 మందిని తదుపరి టెస్ట్‌‌‌‌లకు రెఫర్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వో ఎన్.శ్రీనివాస్​  మాట్లాడుతూ శరీరంపై స్పర్షలేని మచ్చలు ఉంటే డాక్టర్లను సంప్రదించి టెస్ట్‌‌‌‌లు చేయించుకోవాలన్నారు. ప్రైమరీ దశలోనే వ్యాధిని గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చన్నారు. హెల్త్‌‌‌‌ క్యాంపులో డీపీఎంవో హీర్యానాయక్, మెడికల్​ ఆఫీసర్​ సతీశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, సీహెచ్‌‌‌‌వో ప్రమీల, సిబ్బంది టి.శ్రీధర్, సంతోష్ కుమార్, ఏఎన్ఎంలు , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.