అయోధ్యకు పోదాం: ఫ్లైట్ లో సీతారామ లక్ష్మణ వేషధారణలో ప్యాసింజర్లు

అయోధ్యకు పోదాం: ఫ్లైట్ లో  సీతారామ లక్ష్మణ వేషధారణలో ప్యాసింజర్లు

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం యూపీ అయోధ్య ముస్తాబవుతోంది. శ్రీరాముని విగ్రహా ప్రాణప్రతిష్టకు పది రోజులే గడువు ఉంది. దీంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జనవరి 22న ఆలయ పున ప్రారంభోత్సవానికి దేశ విదేశాలనుంచి భక్తులు వస్తున్నారు. ఇప్పటికే కొందరు భక్తులు అయోధ్యకు చేరుకోగా.. ప్రారంభోత్సవ సమయానికి లక్షల్లో భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది.

తాజాగా కొందమంది భక్తులు అయోధ్యకు చేరే క్రమంలో సీతారామ లక్ష్మణ వేషధారణలో విమానంలో వస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

శ్రీరాముుడు,సీత, లక్ష్మణుడు, హనుమంతుని వేషధారణలతో అహ్మదాబాద్  విమానాశ్రయంలో శుక్రవారం (జనవరి 12)  వచ్చారు.ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లేందుకు వచ్చారు. వారి వేషధారణ అందరిని ఆకట్టుకుంది. తోటి ప్రయాణికులు, సిబ్బందికి విమానం క్యాబిన్ లో సీట్లు పంచారు.