హైదరాబాద్, వెలుగు: దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తక్కువ కరెంటును వాడుకునే ఎనర్జీ మేనేజర్ సిరీస్ ఏసీలను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవి త్వరగా చల్లదనాన్ని ఇవ్వడమే గాక, కరెంట్ వాడకాన్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ఎయిర్ కండిషనర్లు ఒక టన్ను నుంచి రెండు టన్నుల వరకు కెపాసిటీతో అందుబాటులో ఉంటాయి. వైఫై ద్వారా ఎల్జీ థింక్ యాప్‌తో వీటిని రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు. ఎనర్జీ మేనేజర్ ఏసీలు స్ప్లిట్, విండో కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఎనర్జీ స్టార్ రేటింగ్ 3 నుంచి 5 వరకు ఉంటుంది.
