జమ్మూకాశ్మీర్​లో త్వరలో ఎన్నికలు

జమ్మూకాశ్మీర్​లో త్వరలో ఎన్నికలు

జమ్మూ/ న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్​లో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్‌​ గిరీశ్​చంద్ర ముర్ము అన్నారు. జమ్మూకాశ్మీర్​ విభజన చట్టం ప్రకారం లడక్​ అసెంబ్లీలేని యూటీ అని,  జమ్మూకాశ్మీర్​ మాత్రం అసెంబ్లీతో కూడిన యూటీ అని, ఇప్పుడున్నట్లు ఎల్​జీ​ పాలన ఎక్కువకాలం కొనసాగడం కరెక్ట్​ కాదన్నారు.    గురువారం రియాసి జిల్లాలో కానిస్టేబుళ్ల పాసింగ్​ఔట్​ పరేడ్​లో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

గవర్నర్‌‌‌‌‌‌‌‌కు ఇద్దరు సలహాదారులు

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌ లెఫ్టినెంట్‌‌‌‌ గవర్నర్‌‌‌‌‌‌‌‌ గిరిశ్‌‌‌‌ చంద్ర ముర్ముకు కేంద్ర హోం శాఖ ఇద్దరు సలహాదారులను నియమించింది. రిటైర్డ్‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ఫరూక్‌‌‌‌ ఖాన్‌‌‌‌, రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ అధికారి కె.కె. శర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో మొదలైన పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో గురువారం పరిస్థితి ప్రశాంతంగా కనిపించింది. పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. లాలాచౌక్‌‌‌‌ సహా ప్రధాన మార్కెట్లలో షాపులు కూడా ఎక్కువ సమయం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని అధికారులు చెప్పారు. ఇంటర్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ క్యాబ్స్‌‌‌‌ కూడా అందుబాటులోకి రావటంతో ప్రజల ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కష్టాలు తీరిపోయాయి.