ఎల్​ఐసీ నుంచి జీవన్​ధార పాలసీ

ఎల్​ఐసీ నుంచి జీవన్​ధార పాలసీ

హైదరాబాద్​, వెలుగు: ఎల్​ఐసీ  జీవన్ ధార–2ను లాంచ్ చేసింది.  ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, పర్సనల్​ సేవింగ్స్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ . ప్రారంభం నుంచీ యాన్యుటీకి హామీ ఉంటుంది. పాలసీదారులకు 11 యాన్యుటీ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

ఎంట్రీకి కనీస వయస్సు 20 సంవత్సరాలు.  ఈ ప్లాన్ ​డిఫర్​మెంట్​ పీరియడ్​లో లైఫ్‌కవర్‌ను అందిస్తుంది.  అధిక వయస్సులో ఎక్కువ వార్షిక రేటును అందిస్తుంది.  ఏడాది, ఆర్నెళ్లు, మూడు నెలలు, నెలకు ఒకసారి ప్రీమియం చెల్లించవచ్చు. ఈ ప్లాన్​ను ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో కొనొచ్చు.