లైసెన్స్​డ్​ సర్వేయర్లు దరఖాస్తు చేసుకోవాలి :  కలెక్టర్ విజయేందిర బోయి

లైసెన్స్​డ్​ సర్వేయర్లు దరఖాస్తు చేసుకోవాలి :  కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  భూ భారతి చట్టం 2025 అమలులో భాగంగా రెవెన్యూ యంత్రాంగం, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖకు సహాయపడేందుకు ఆసక్తి గల లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సర్వేయర్లు మీ సేవా ద్వారా మే 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని  కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.  పౌరుల భూ సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి భూమి హక్కుల రికార్డు చట్టం, 2025ను అమలులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

 రెవెన్యూ  యంత్రాంగం, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సహాయపడేందుకు రాష్ట్రంలో దాదాపు 5 వేల మంది లైసెన్స్ పొందిన సర్వేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి జిల్లాల్లో నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ఈ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సర్వేయర్లకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ద్వారా  మే 26 నుండి  50 రోజుల పాటు  శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.