
న్యూఢిల్లీ: అతిపెద్ద డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (డీఐఐ) అయిన ఎల్‌ఐసీ హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో తన వాటాను 10.26శాతానికి పెంచుకుంది.
ఇది ఈ ఏడాది జూన్‌లో 8.21శాతంగా ఉంది. జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు ఎల్‌ఐసీ 1.71 కోట్ల షేర్లను మార్కెట్‌లో కొనుగోలు చేసింది. ఇది సుమారు 2శాతం వాటాకు సమానం.
ఈ కొనుగోలు ద్వారా ఎల్‌ఐసీ ఇప్పుడు 10శాతానికి పైగా వాటా కలిగిన వాటాదారుగా మారింది. డాక్టర్ రెడ్డీస్‌పై ఎల్‌ఐసీకి ఉన్న లాంగ్‌టర్మ్ విశ్వాసాన్ని ఇది సూచిస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు.
డాక్టర్ రెడ్డీస్ షేరు ధర శుక్రవారం ఒక శాతానికి పైగా పెరిగి రూ.1,256 వద్ద ముగిసింది. ఎల్‌ఐసీ 2024 అక్టోబర్ నుంచి ఈ ఫార్మా కంపెనీలో వాటా పెంచుకుంటూ వస్తోంది. జూన్ 2025లో 8శాతం మార్క్‌ను దాటి ఇప్పుడు 10శాతానికి చేరింది.