సర్పంచ్ భర్త నుంచి ప్రాణహాని

V6 Velugu Posted on Sep 15, 2021

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం వడ్డేవాట సర్పంచ్ భర్త నుంచి ప్రాణహాని ఉందని... HRCని ఆశ్రయించారు బాధిత మహిళలు. సర్పంచ్ భర్త, TRS నేత లక్ష్మికాంత్ రెడ్డి దాడి తమపై చేయించారని బాధిత మహిళ మాసమ్మ HRCకి ఫిర్యాదు చేసింది. తమ భూమిని అక్రమించేందుకు లక్ష్మికాంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించింది. ఇదే విషయంపై కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు, తమ కుటుంబ సభ్యులకు లక్ష్మికాంత్ రెడ్డి నుంచి ప్రాణారక్షణ కల్పించాలి కోరింది. కొత్తకోట పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాసమ్మ HRCని వేడుకుంది.

Tagged life threatening, Sarpanch husband, Victim, resorted, HRC

Latest Videos

Subscribe Now

More News