ఒకే పాలసీతో జీవితాంతం పెన్షన్‌!

ఒకే పాలసీతో జీవితాంతం పెన్షన్‌!
  • ఎల్‌‌‌‌ఐసీ జీవన్ శాంతి పాలసీతో చాలా బెనిఫిట్స్‌‌‌‌
  • రెండు ఆప్షన్లలో అందుబాటులోకి... 
  • కనీసం రూ. లక్షన్నరతో ఈ ప్లాన్‌‌‌‌ తీసుకోవచ్చు

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు:  ఎల్‌‌‌‌ఐసీ తన పాలసీ హోల్డర్లకు వివిధ రకాల ప్లాన్స్‌‌‌‌ను ఆఫర్ చేస్తోంది. ఎండోమెంట్ ప్లాన్‌‌‌‌ (పాలసీ మెచ్యూరిటీ తర్వాత ఒకే సారి మొత్తం డబ్బులు పొందొచ్చు), యూనిట్ లింక్డ్‌‌‌‌  ప్లాన్‌‌‌‌ (యులిప్‌‌‌‌– పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌ చెల్లించే ప్రీమియంలో కొంత ఇన్సూరెన్స్‌‌‌‌గా, మిగిలింది మార్కెట్‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌గా వాడతారు) లను ఆఫర్ చేస్తోంది. అలానే  పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌కు జీవితాంతం పెన్షన్‌‌‌‌ అందించే ప్లాన్‌‌‌‌ను కూడా తెచ్చింది. అదే ఎల్‌‌‌‌ఐసీ జీవన్ శాంతి పాలసీ. ఒకసారి ఈ పాలసీ  తీసుకుంటే తర్వాతి నెల నుంచే   ప్రతీ నెలా  పెన్షన్‌‌‌‌గా పొందొచ్చు.  ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, ఆ మనీపై వడ్డీ యాడ్ చేస్తారు. నెలా నెలా పెన్షన్‌‌‌‌ ఇస్తారు. జీవన్ శాంతి పాలసీ  రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉందని ముంబైలో ఉండే ట్యాక్స్ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ బల్వంత్​ జైన్ అన్నారు. ఒకటి ఇమీడియేట్ ఆప్షన్‌‌‌‌ కాగా, రెండోది డిఫర్డ్‌‌‌‌ యాన్యుటీ ఆప్షన్‌‌‌‌.  ఇమీడియేట్ ప్లాన్‌‌‌‌లో  ఈ పాలసీ కొన్న నెక్స్ట్‌‌‌‌మంత్ నుంచే పెన్షన్ పొందొచ్చు. అదే డిఫర్డ్ యాన్యుటీ అంటే పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌ రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్ తర్వాత నుంచి పెన్షన్ పొందొచ్చు.  ‘రిటైర్‌‌‌‌‌‌‌‌ అయిన లేదా రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌కు దగ్గరలో ఉన్నవారికి  ఇమీడియేట్ ప్లాన్   బెటర్‌‌‌‌‌‌‌‌. ఈ ప్లాన్ తీసుకుంటే నెక్స్ట్‌‌‌‌ మంత్‌‌‌‌ నుంచే పెన్షన్‌‌‌‌ పొందొచ్చు. డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్‌‌‌‌లో పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌ రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజ్ తర్వాత పెన్షన్‌‌‌‌ అందుకుంటాడు. అప్పటి వరకు  పాలసీహోల్డర్‌‌‌‌‌‌‌‌ కట్టే ప్రీమియం మిగిలిన ఎల్‌‌‌‌ఐసీ ఎండోమెంట్ ప్లాన్లలానే వృద్ధి చెందుతుంది’ అని బలవంత్‌‌‌‌ జైన్ పేర్కొన్నారు. 

పెన్షన్ ఎంతొస్తుంది ?
పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌ చెల్లించే  ప్రీమియం బట్టి నెలకు వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. అంటే ఇమీడియేట్ ప్లాన్‌‌‌‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే, నెలకు కొంత అమౌంట్‌‌‌‌ను జీవితాంతం ఎల్‌‌‌‌ఐసీ చెల్లిస్తుంది. అదే డిఫర్డ్‌‌‌‌ యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే రిటైర్ ఏజ్‌‌‌‌ వరకు  ప్రతీ ఏడాది కొంత ప్రీమియం కట్టాలి. పాలసీ హొల్డర్‌‌‌‌‌‌‌‌ కట్టే అమౌంట్‌‌‌‌పై వడ్డీ యాడ్ అవుతుంది.  రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజ్ వచ్చాక పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌ ఇన్సూర్డ్ అమౌంట్‌‌‌‌ను బట్టి  పెన్షన్‌‌‌‌ ఇస్తారు. డిఫర్డ్‌‌‌‌ యాన్యుటీ ప్లాన్‌‌‌‌లో పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌ చెల్లించే ప్రీమియంపై ఏడాదికి 6 శాతం వడ్డీని పొందొచ్చు. జీవన్‌‌‌‌ శాంతి ప్లాన్‌‌‌‌లో ఇచ్చే పెన్షన్‌‌‌‌  నెలకు రూ. 1,000 నుంచి స్టార్టవుతుంది. పెన్షన్‌‌‌‌ను  3 లేదా, 6 లేదా, 9 లేదా 12 నెలలకు ఒకసారి పొందొచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వాళ్లు ఎల్‌‌‌‌ఐసీ జీవన్ శాంతి పాలసీని ఎంచుకోవడం బెటర్.  ముఖ్యంగా రిటైర్‌‌‌‌‌‌‌‌ అయిన వాళ్లు, రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌కు దగ్గర్లో ఉన్నవాళ్లకు ఈ పాలసీ సరిపోతుంది. 30 ఏళ్లు నిండిన వారు ఎవరైనా జీవన్ శాంతి ప్లాన్‌‌‌‌ను తీసుకోవచ్చు.  కనీసం రూ. 1,50,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాలసీని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లో కొనుక్కోవచ్చు. ఎల్‌‌‌‌ఐసీఇండియాడాట్‌‌‌‌ఇన్ నుంచి డైరెక్ట్‌‌‌‌గా ఈ పాలసీని కొనొచ్చు. ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లో అయితే ఎల్‌‌‌‌ఐసీ ఏజెంట్ నుంచి లేదా దగ్గరలోని బ్రాంచుకు వెళ్లి ఈ పాలసీ కొనుక్కోవచ్చని బల్వంత్​ జైన్​ వివరించారు.