లైగర్ లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది

లైగర్ లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ‘లైగర్’లో కీలక పాత్రలో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుద‌లైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. 

తాజాగా ఈ మూవీ నుండి విజయ్ దేవరకొండ బోల్డ్ పిక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫోటోలో విజయ్ సిక్స్ ప్యాక్ బాడీతో.. ఒంటిపై బట్టలు లేకుండా నిల్చున్నాడు.. పూల బోకే చేతిలో పట్టుకొని ఉన్న లుక్ ను పోస్టర్ లో చూడొచ్చు. హీరో లుక్స్, బాడీ, పోస్టర్ అన్నీ క్రేజీగా వున్నాయి. హీరోకి వున్న యూత్, లేడీ ఫాలోయింగ్ ను క్యాచ్ చేసే లా పోస్టర్ ను కట్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ చిత్నాని క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరీ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు తోపాటు హిందీ, త‌మిళం, క‌న్నడ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది.