కొరిటికల్ గ్రామంలో పిడుగుపాటుకు ఆలయ శిఖరం ధ్వంసం

కొరిటికల్ గ్రామంలో పిడుగుపాటుకు ఆలయ శిఖరం ధ్వంసం

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలం కొరిటికల్ గ్రామంలోని  శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిఖరం సోమవారం పిడుగుపడి ధ్వంసమైంది. గోపురం స్వల్పంగా దెబ్బతింది. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో భక్తులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.