బుమ్రాలా రాణించే సత్తా అతడి సొంతం

V6 Velugu Posted on Mar 28, 2021

ముంబై: ఇంగ్లండ్‌‌తో వన్డే సిరీస్‌‌లో యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆకట్టుకుంటున్నాడు. చక్కని పేస్, గుడ్ లెంగ్త్ బంతులు, మంచి లైనప్‌తో వేస్తూ ఇంగ్లీష్ బ్యాట్స్‌‌మెన్‌‌ను బాగా కట్టడి చేస్తున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కొంత తడబడినా.. సెకండ్ స్పెల్‌‌లో చక్కటి బంతులతో వికెట్లు పడగొడుతున్నాడు. అందుకే ప్రసిద్ధ్‌ను భవిష్యత్‌ తారగా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మెచ్చుకున్నాడు. బుమ్రాలా రెడ్ బాల్ క్రికెట్‌లోనూ ప్రసిద్ధ్ కృష్ణ మంచి బౌలర్‌‌గా అవతరిస్తాడని జోస్యం పలికాడు. 

‘ప్రసిద్ధ్ కృష్ణ వేస్తున్న సీమప్ డెలివరీలు చాలా బాగున్నాయి. టెస్టు టీమ్ ఎంపికలో ప్రసిద్ధ్ పేరును టీమిండియా సెలెక్షన్ కమిటీ పరిశీలించాలి. బుమ్రా టీ20లు, వన్డేల నుంచి టెస్టుల్లో కీలక బౌలర్‌‌గా ఎదిగాడు. అతడిలాగే ప్రసిద్ధ్ కూడా ప్రీమియం బౌలర్‌‌గా మారగలడు. ఆ సత్తా అతడిలో ఉంది. ప్రసిద్ధ్ పేస్, సీమప్ పొజిషన్ రెడ్ బాల్ క్రికెట్‌‌కు సరిగ్గా సూటవుతాయి’ అని గవాస్కర్ పేర్కొన్నాడు. 
 

Tagged Cricket, tests, Praises, sunil gavaskar, Bumrah, Prasidh Krishna

Latest Videos

Subscribe Now

More News