కరెంట్ బిల్లు బకాయిలు అడిగినందుకు లైన్​మన్​పై దాడి

కరెంట్ బిల్లు బకాయిలు అడిగినందుకు  లైన్​మన్​పై దాడి
  • ఇంటి ఓనర్​పై మాసబ్ ట్యాంక్  పీఎస్‌లో కేసు నమోదు 

మెహిదీపట్నం, వెలుగు: కరెంటు బిల్లు బకాయిలు చెల్లించమన్నందుకు ఓ ఇంటి యజమాని విద్యుత్ లైన్​మన్​పై దాడి చేసిన ఘటన మాసబ్​ట్యాంక్ పీఎస్ పరిధిలో జరిగింది.  ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..  మెహిదీపట్నం హైమద్ నగర్ ఫస్ట్ లాన్సర్‌‌లో ఉండే సయ్యద్ సలీముద్దీన్ కొంతకాలంగా కరెంట్ బిల్లు చెల్లించడం లేదు. 

కరెంట్ బకాయిలు రూ.37 వేల 449 ఉండటంతో స్థానిక లైన్ మన్ లక్ష్మినారాయణ శనివారం సలీముద్దీన్ ఇంటికి వెళ్లాడు. కరెంట్ బకాయిలు క్లియర్ చేయాలని చెప్పాడు. తాను బిల్లు కట్టనని.. ఏం చేస్తారో చూస్తానని సలీముద్దీన్ అనడంతో లక్ష్మినారాయణ ఆ ఇంటి సర్వీస్ వైర్​ను కట్ చేశాడు. దీంతో సలీముద్దీన్ లైన్మన్​పై దాడి చేశాడు. మెహిదీపట్నం డీఈ  శ్యాంసుందర్, విజిలెన్స్ సిబ్బందితో కలిసి బాధితుడు ఈ ఘటనపై  మాసబ్​ట్యాంక్ పీఎస్‌లో కంప్లయింట్ చేశాడు. సలీముద్దీన్​పై కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.