న్యూఢిల్లీ: సెక్యూరిటీ మార్కెట్ (షేర్లు, బాండ్లు వంటివి) లో ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాన్సాక్షన్లు జరగాలంటే ఈ నెల ముగిసే లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని సెబీ ఇన్వెస్టర్లకు సూచించింది. ఒకవేళ ఈ లింక్ జరగకపోతే పాన్ నెంబర్ పనిచేయదని ప్రకటించింది. సెక్యూరిటీ మార్కెట్‌లో పాన్ కార్డు చాలా ఇంపార్టెంట్. అందుకే సెబీ వద్ద రిజిస్టర్ చేసుకున్న సంస్థలు, కంపెనీలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇష్యూ చేసిన రూల్స్‌ను ఫాలో కావాలని సెబీ పేర్కొంది. సెప్టెంబర్ 30 తర్వాత పాన్‌తో ఆధార్ లింక్ అయి ఉంటేనే కొత్త అకౌంట్లను క్రియేట్ చేయాలని వివరించింది.
