హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్‌సిటీకి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడానికి రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన రేడియల్రోడ్లను ఫ్యూచర్‌సిటీకి అనుసంధానంగా నిర్మించనున్నారు. ఔటర్‌నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రేడియల్ రోడ్–1 ప్రాజెక్టును రూ.1,911 కోట్లతో చేపట్టి టెండర్లను కూడా ఆహ్వానించారు.
త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. రెండో దశ రేడియల్రోడ్ను రూ.2,710 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రకియ కూడా కొనసాగుతోంది. ఔటర్రింగ్రోడ్నుంచి ట్రిపుల్ఆర్వరకు వేయాలనుకుంటున్న రేడియల్రోడ్లను 41.50 కి.మీ. మేర నిర్మించనున్నారు. మొదటి దశ రేడియల్ రోడ్‌ను రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు19.20 కి.మీ, రెండోదశ రేడియల్రోడ్ను మీర్‌ఖాన్‌పేట నుంచి ఆమన్గల్వరకు 22.30 కి.మీ. మేర నిర్మించనున్నారు.
వీటితో పాటు భవిష్యత్‌లో ప్రత్యేక మెట్రో/రైల్వే కారిడార్, గ్రీన్‌బెల్ట్స్, సైకిల్ ట్రాక్స్, ఫుట్‌పాత్‌లు, సర్వీస్ రోడ్లు రానున్నాయి. రెండు దశల్లో కలిపి రేడియల్‌రోడ్లు 14 గ్రామాల నుంచి వెళ్లాయి. మొదటి దశ రేడియల్రోడ్ కొంగర ఖుర్ద్, ఫిరోజ్‌గూడ, కొంగర కలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌పేట మీదుగా నిర్మించనుండగా.. రెండోదశ రోడ్లను కుర్మిడ్డ, కడ్తాల్, ముద్విన్, ఆకుతోటపల్లి, అమంగల్. (యాచారం, కడ్తాల్, ఆమనగల్ మండలాల్లో) నిర్మించనున్నారు.
పెరగనున్న ట్రాన్స్‌పోర్టేషన్
ఈ ప్రాజెక్టులో భాగంగా ఓఆర్ఆర్నుంచి ట్రిపుల్ఆర్వరకు రేడియల్రోడ్లను నిర్మించడం వల్ల దక్షిణ జిల్లాలకు వెళ్లే వారికి ప్రయాణ సమయం తగ్గుతుంది. భవిష్యత్తులో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ (మెట్రో/రైలు)కు సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతమున్న రోడ్లపై రద్దీ కూడా తగ్గుతుంది. రేడియల్ రోడ్లను ఫ్యూచర్ సిటీకి అనుసంధానించడం వల్ల హైదరాబాద్ నుంచి సులభంగా ప్రయాణించవచ్చు..
ఫ్యూచర్‌సిటీ వైపు అభివృద్ధి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఫ్యూచర్‌సిటీ వైపు భారీ ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఐటీ పార్కులు, హబ్‌లు, పరిశోధనా కేంద్రాలు, పరిశ్రమలు, స్కిల్ వర్సిటీలు ఏర్పాటవుతాయి కాబట్టి అక్కడ నివాసముండే వారికి ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు. రాబోయే కాలంలో ఫ్యూచర్‌సిటీ భారీగా మౌలిక సదుపాయలున్న నగరంగా రూపుదిద్దుకుంటుందని చెప్తున్నారు.
భారీ సంఖ్యలో దేశ విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయంటున్నారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఐటీ అనుబంధ రంగాల్లో లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు. ఫ్యూచర్‌సిటీలో ఉండే వారి కోసం సైకిల్ ట్రాక్స్, గ్రీన్‌బెల్ట్స్, ఫుట్‌పాత్‌లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందంటున్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
