బెల్ట్ షాపుల్లో మద్యం ధ్వంసం.. ఆదిలాబాద్ జిల్లా దేగామలో ఘటన

బెల్ట్ షాపుల్లో మద్యం ధ్వంసం.. ఆదిలాబాద్ జిల్లా దేగామలో ఘటన

బజార్ హత్నూర్, వెలుగు:  ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దేగామలో గ్రామ తీర్మానాన్ని బేఖాతరు చేసిందుకు బెల్టు షాపుల్లోని మద్యాన్ని గ్రామస్తులు ధ్వంసం చేశారు. శుక్రవారం కొందరు గ్రామస్తులు షాపుల్లోకి వెళ్లి తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు లభించాయి. 

గ్రామ పెద్దల నిర్ణయాన్ని కాదని, కొందరు తమ షాపుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా షాపు యజమానులు తీరు మార్చుకోకుండా అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నారని తెలిపారు.