
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సమీపంలో బుధవారం తెల్లవారుజామున కల్వర్టును ఢీకొని లిక్కర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ బాలు దాస్, క్లీనర్ నరేశ్ క్షేమంగా బయటపడ్డారు.
సంగారెడ్డి యువీ డిస్టిలరీ నుంచి హనుమకొండ డిపో 1 కు సుమారు రెండు వేల కింగ్ ఫిషర్ బీర్ల పెట్టెలను లారీలో తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. లారీలో దాదాపు రూ. 25 లక్షల విలువ చేసే లిక్కర్ కిందపడిపోయింది. లిక్కర్ బాటిల్స్ అపహరణకు గురికాకుండా ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్, ఎస్సె తిరుపతి, సిబ్బంది ఖలీల్, లాల, రవీందర్, ముల్కనూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.